వేద న్యూస్, నల్లబెల్లి :
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లి గ్రామానికి చెందిన పోతారాబోయిన మనోహర్ (25) తండ్రి చేరాలు
ఒకే ఒక కుమారుడు సోమవారం రాత్రి కొమ్మల జాతరకు దర్శనానికి వెళ్లి అనంతరం తిరిగి నల్లబెల్లి, దస్తగిరిపల్లెకు స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తొగర్రాయి గ్రామ శివారులో బైక్ పై వస్తున్న మనోహర్ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ను గుద్దినట్టు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. విషయం తల్లిదండ్రులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దస్తగిరి పల్లెలో యువకుడి మృతి సంఘటనా స్థానికంగా కలకలం సృష్టించాయి.
