వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్:
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమనేత ఆర్ వీ మహేందర్ కుమార్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసిన ఆర్ వీ..గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది.
మొదటి నుండి గులాబీ పార్టీ కోసం పనిచేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నాయకుడు అయిన ఆర్ వీ మహేందర్ కుమార్ కు ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గోషామహల్ ను నిత్యం చుట్టేస్తున్న ఆర్ వీ మహేందర్ కుమార్ కేటీఆర్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంచరించుకున్నట్లైంది.
త్వరలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి అనేది అనౌన్స్ చేయనున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. కాగా, గోషామహల్ లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని ఆర్ వీ మహేందర్ కుమార్ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తానని ఆర్ వీ హామీనిచ్చారు. గోషామహల్ ను అభివృద్ధిలో నెంబర్.1 చేస్తామని పేర్కొన్నారు.