- హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణులను నియమించండి
- హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు సామాజికవేత్త వెంకట్ వినతి
- త్వరలో కార్డియాలజిస్టులను నియమిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ
వేద న్యూస్, హైదరాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో సమస్యలపై ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్ ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ తన గళం వినిపిస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలో విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తన వంతుగా కృషి చేస్తూనే… ప్రభుత్వాల పరంగా చేయాల్సిన విషయాలపై సామాజికవేత్త తన వాయిస్ వినిపిస్తున్నారు.
ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తూ.. పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇటీవల జమ్మికుంట సివిల్ హాస్పిటల్ ను సందర్శించి వసతుల కల్పన, వైద్య నిపుణుల కొరత గురించి వాకబు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో గుండె వైద్య నిపుణుల కొరత, ఆవశ్యకత గురించి తెలుసుకుని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ని కలిసి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. తనతో ఉన్న సన్నిహిత్యం కారణంగా మంత్రి కూడా సానుకూలంగా స్పందించి.. త్వరలో అధికారులతో మాట్లాడి గుండె వైద్య నిపుణులను నియమిస్తానని హామీ ఇచ్చారని సబ్బని వెంకట్ వెల్లడించారు.