•  పద్మశాలి జాతి శ్రేయస్సుకు పని చేస్తా: కుడికాల

వేద న్యూస్, హుజురాబాద్:
తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా, మండల కమిటీల నిర్మాణంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి యువజన నాయకుడు, రిపోర్టర్ కుడికాల సాయిని హుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు.

ఈ సందర్బంగా కుడికాల సాయి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం చేనేత కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. అదే విధంగా నియోజక వర్గ వ్యాప్తంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక కమిటీలు ప్రచార కార్యదర్శి జడల చిరంజీవి సహకారంతో నిర్మాణం చేస్తామని సాయి తెలిపారు.