- జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు వినతి
వేద న్యూస్, వరంగల్ :
హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి పేట జాతర కమిటీ సభ్యులు కోరారు.
ఈ మేరకు వారు బుధవారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాకు ఆయన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగు జాతరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో జాతర చైర్మన్ కొండూరి భిక్షపతి, జాతర ఆర్గనైజర్ దాసి రాందేవ్, ఆవునూరి కుమారస్వామి, పి.స్వామి తదితరులున్నారు.