వేద న్యూస్, వరంగల్/కొత్తకొండ:

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరన్నను ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ సమ్మరావు గురువారం దర్శించుకున్నారు.  వీరభద్ర స్వామి వారికి అభిషేకం చేశారు.  అమ్మవారి కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం తరఫున శేష వస్త్రముతో అర్చకులు సన్మానం చేశారు. అనంతరం వేద ఆశీర్వాదములు అందజేశారు. కార్యక్రమంలో  వీరభద్ర స్వామి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి పి కిషన్ రావు, అర్చకులు రాంబాబు, శివకుమార్ పాల్గొన్నారు.