వేద న్యూస్, భూపాలపల్లి:
భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన గండ్ర సత్యనారాయణరావు(జీఎస్ఆర్)ను నాయకులతో కలిసి మేదరమెట్ల గ్రామ ఉప సర్పంచ్ వంగపండ్ల సంపత్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తన్నను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా గండ్ర సత్తన్న పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన జీఎస్ఆర్(గండ్ర సత్యనారాయణరావు) భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి అందరికీ విదితమే.
