వేద న్యూస్, ఓరుగల్లు:
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు పాలాభి షేకం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలిపారు. 30 శాతం పీఆర్సీ అమలు చేస్తూ పెరిగిన జీతం కళాకారుల ఖాతాల్లో జామచేసిన సందర్భంగా అర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించారు. నగరంలోని గోపాలస్వామి గుడి సమీపంలో వరంగల్ జిల్లా టీ ఎస్ ఎస్ కళాకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క చిత్ర పటాలకు బుధవారం పాలాభిషేకం నిర్వహించి, స్విట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా 24514 రూపాయల జీతం పనిచేస్తున్నామని అన్నారు. 30 శాతం పీఆర్సీ జీ ఓ ను గత ప్రభుత్వం వర్తింపజేసినప్పటికి కొన్ని సాంకేతిక కారణాల వలన అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా 24514 కు 30 శాతం పెంచి 31863 రూపాయల జీతం ఖాతాల్లో జమ చేశారని ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆట పాటల ద్వారా ప్రజలకు వివరించి ప్రభుత్వానికి విధేయులుగా వుంటాని అన్నారు. మరింత ఉత్సాహం తో పని చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తాళ్ళ సునీల్, జూపాక శివ, ఆనందం, భరత్, యోచన, బాబు, రామనాథం, వెంకన్న, కుమారస్వామి, గణేష్, పరమేష్, శాలిని, ఝాన్సీ, హరిత, విజయ తదితరులు పాల్గొన్నారు.