వేద న్యూస్,కాసిపేట:

మంచిర్యాల జిల్లా కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ధరవత్ దేవి కొండయ్య బరిలోకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తులకు చేరేలా కృషి చేస్తామనే ధృఢ నిశ్చయంతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ధరవత్ దేవి కొండయ్యకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యక్తంగా మద్దతు తెలుపుతూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఓరియంట్ ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్ రావు కూడా దేవి–కొండయ్య దంపతులకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గ్రామ అభివృద్ధిలో ఈ కుటుంబం నిరంతరం ముందుండి సేవలు అందించిందని ఆయన అభినందించారు.సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన దేవి కొండయ్య మాట్లాడుతూ
“ప్రజల నమ్మకానికి తగినట్లుగా పంచాయతీ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రతి ఇంటికి శుద్ధి నీరు, విద్యుత్, రహదారుల అభివృద్ధి మా ప్రాధాన్యం” అని తెలిపారు.స్థానిక ప్రజలు, యువత, మహిళా సంఘాలు ఆమె అభ్యర్థిత్వంపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తుండడంతో కాసిపేట సర్పంచ్ పోటీకి కొత్త చైతన్యం వచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.