• తొలితరం మహిళా ఉద్యమకారణి సావిత్రిబాయి
  • జమ్మికుంట డిగ్రీ, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పారు.

 

పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని కొనియాడారు. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు ఆమె శ్రమించారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి రాజశేఖర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎల్.రవీందర్, డాక్టర్ ఈ.రవి, అధ్యాపకులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ సువర్ణ, ఈశ్వరయ్య, శ్రీనివాసరెడ్డి, మమత, డాక్టర్ సుష్మ, డాక్టర్ రవి ప్రకాష్, సుధాకర్, శ్రీకాంత్ బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.