వేద న్యూస్, నర్సంపేట : 

నర్సంపేట పట్టణంలోని న్యూ శ్రీ రఘు పబ్లిక్ స్కూల్ కు చెందిన 2003-04 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మహేశ్వరం లోని గ్రీన్ రిసార్ట్స్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా తెలంగాణ కోసం అమరులైన వారి కోసం రెండు నిముషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం విద్యార్థులంతా కలిసి పాఠశాలలో చిన్నప్పటి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు బొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము ఎంత ఎదిగిన ఒదిగి ఉంటామ్మన్నారు.పూర్వ విద్యార్థులంతా కలిసి ఒక పాట పాడారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో, రఘు పబ్లిక్ స్కూల్ లో అంటూ ఒకరికొకరు అనుభవాలు, ఆనందాలు పంచుకున్నారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు అనంతుల రమేష్, రవీందర్, అశోక్, అర్లయ్య,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.