వేద న్యూస్, జమ్మికుంట:
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల జమ్మికుంటలో సైన్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో గమనించినప్పటికీ ఈ పాఠశాలలో సుమారు 100కు పైగా ఎగ్జిబిషన్ ప్రదర్శించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ టీచర్లను ప్రత్యేకించి అభినందించారు. విద్యార్థులందరూ కూడా సైన్స్ లో నేర్చుకున్న విషయాలను ఈ విధంగా ప్రదర్శించినప్పుడు తప్పకుండా విజ్ఞానవంతులు అవుతారని వెల్లడించారు.
మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఉపాద్యాయుల కు, విద్యార్థుల కు అభినందనలు తెలిపారు.
ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు పట్టణంలోని 13 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి సుమారుగా 1,000 మంది విద్యార్థులు తిలకించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల సదానందం, సైన్సు ఉపాధ్యాయులు వి స్రవంతి, కే ప్రతిభ, పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.