వేద న్యూస్, వీర్నపల్లి :
గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం రెండు గంటల పాటు మర్రిమడ్ల – ఎల్లారెడ్డిపేట్ వెల్లె ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఉదయం వేళ బస్సులను నడపకపోవడం వల్ల మండల కేంద్రంలో విద్యనభ్యసించే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి పాఠశాలలకు చేరుకోలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై రాజన్న సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌కు అనేక వినతి పత్రాలు అందజేసిన పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠశాలల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.