- ముత్యాల తలంబ్రాలు మోసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- శివనామ స్మరణతో మారుమోగిన ఆలయం
- ఆలయ కమిటీ చైర్మన్ కొండ విజయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
వేద న్యూస్, జమ్మికుంట:
ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వరస్వామి శివాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య కనులపండువగా జరిగింది.
ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ కొండ విజయ్ స్వగృహం నుండి మేళతాలల మధ్య ముత్యాల తలంబ్రాలు మోసుకెళ్లి శివాలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి సమర్పించారు.. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక అర్చన, అభిషేకాలు చేశారు.
ఈ సందర్భంగా వేదపండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని శాలువా తో సత్కరించి శివాలయం ఫోటో ప్రేమ్ అందించారు.
శుక్రవారం రాత్రి శివ పార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా వేద పండితుల ఉచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని – వెంకటేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక – తిరుపతిరెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ కొండ విజయ్, ఆలయ అర్చకులు భైరవభట్ల నరేందర్ శర్మ, మురహరి నరేందర్ రెనుకుంట్ల సారయ్య, జిల్లెల దేవేందర్ రెడ్డి,వేముల సుధాకర్ రెడ్డి,
కోడం రజిత- శ్రీనివాస్, కురిమిండ్ల చిరంజీవి,మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్,మరిగిద్ద మొగిలి,పర్కాల విజయ్,వంగ రామకృష్ణ,అబ్బిడి శివారెడ్డి,గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.