వేద న్యూస్, పాపన్నపేట :
వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందయమని పాపన్నపేట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ గౌడ్ అన్నారు.ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో శివాజీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన శివాజీ ఆటో యూనియన్ సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమే వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు, శివాజీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శులు హరీష్, భూషణం, చిన్న, సుధాకర్, గోపాల్, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.