వేద న్యూస్,  వరంగల్ :

మరాఠా యోధుడు, అసమాన ధీశాలి, ఆదర్శ మరాఠా స్వరాజ్య స్థాపకుడు బడుగుల జీవితాలలో దారిదివిటి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని బుధవారం ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ 395వ జయంతిని మండల పరిధిలోని, దామెర, చింతలపల్లి, సూరారం, ఎలుకతుర్తి ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. దామెర గ్రామస్తులు బైకు ర్యాలీ నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుకినే సంతాజీ హాజరై మాట్లాడారు. ఆరెకుల ఆరాధ్య దైవ సమానులు మహారాష్ట్ర కుంబి కులంలో జన్మించి స్వశక్తితో మారాట సామ్రాజ్యం స్థాపించి, దేశంలోని బహుజనులకు చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ అని కొనియాడారు.

మండల కేంద్రంలోని ఆరెకుల సంఘం మండల అధ్యక్షుడు కుడితాడి రాజు ఆధ్వర్యంలో జరిగిన శివాజీ జయంతి వేడుకలను పార్టీలకతీతంగా నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని రైతులు, స్త్రీలు ఉన్నత వర్గాలు నిమ్మ వర్గాలకు భాగస్వామ్యం చేసి, ఆదర్శ బహుజన రాజ్యం స్థాపించిన యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు.

చిన్నతనంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొఘాల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి,వారికి చరమ గీతం పాడి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యం స్థాపించి, స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని తెలిపారు.

కార్యక్రమంలో ఆరె సంఘం మండల అధ్యక్షుడు కుడితాడు రాజు, జిల్లా నాయకులు హింగే భాస్కర్, సుకినె సుధాకర్ రావు, అంబీర్ శ్రీనివాస్, హింగే రవీందర్, వరికల కృష్ణ, కదం రాజు, రాజేశ్వరరావు, కృష్ణ, గోలి రాజేశ్వర్ రావు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్ బక్కి, రవీందర్ రెడ్డి, రాజేందర్, బిక్షపతి, రమేష్,హింగే శ్రీకాంత్, రమేష్ బాబు, సురేందర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.