Screenshot

వేద న్యూస్, కాసిపేట:

కాసిపేట మండలం సోమగూడెం(కే) గ్రామానికి చెందిన అక్షర స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ ఆకస్మిక మరణం జిల్లాలో విద్యావేత్తల వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఈ క్రమంలో ట్రాస్మా – తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, మంచిర్యాల జిల్లా తరపున ఆయన కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచింది.
ట్రాస్మా జిల్లా నాయకులు సేకరించిన రూ.1,75,000 మొత్తాన్ని శివకుమార్ కుటుంబానికి అందజేశారు. ఇందులో రూ.1,50,000 ను ఆయన కుమార్తె పేరు మీద ఎల్ఐసి ఫిక్స్డ్ బాండ్ రూపంలో భవిష్యత్తు భద్రత కోసం జమ చేయగా, మిగిలిన రూ.25,000 ను వారి తక్షణ అవసరాల నిమిత్తం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ట్రస్మా రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు హాజరై శివకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పిల్లల విద్య విషయంలో వారు ఎక్కడ చదువుకున్నా జిల్లా ట్రస్మా పూర్తి సహకారం అందిస్తుందని నాయకులు హామీ ఇచ్చారు. పిల్లలకి భవిష్యత్ లో ఎలాంటి కష్టమొచ్చిన ట్రస్మా అండగా నిలబడతుందని ఆ కుటుంబానికి పూర్తి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ సతిమణి భావోద్వేగానికి లోనై ట్రస్మా నాయకులందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణువర్ధన్ రావు, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు కొమ్ము దుర్గాప్రసాద్, మందమర్రి మండల అధ్యక్షులు పెద్దపల్లి ఉప్పలయ్య, కాసిపేట మండల అధ్యక్షులు ఎస్. చంద్ర శేఖర్,ట్రస్మా నాయకులు ఉస్మాన్ పాషా, వై కరుణాకర్ రెడ్డి, లడ్డూరి రమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.