- భక్తజనంతో కిటకిటలాడిన ప్రాంగణం
- శివపార్వతులకు పట్టు వస్త్రములు సమర్పించిన దేవాలయ చైర్మన్
- మూడవరోజు హోరా హోరీగా సాగిన కబడ్డీ పోటీలు
- గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేత
- సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయ కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శివపార్వతుల కళ్యాణం లో దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అశోక కుమార్ దంపతులు పాల్గొని అర్చనలు అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రములు సమర్పించారు. కాగా ఈ కళ్యాణము ప్రత్యేక పూలతో అలంకరించిన శివపార్వతుల కళ్యాణ నివేదికలో దేవాలయ పురోహితులు రెంటాల మణిశర్మ సతీష్ శర్మ గ్రామ పురోహితులు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కళ్యాణం లో జిల్లా నలుమూలల నుండి దాదాపు పదివేల మందికి పైగా భక్తులు పాల్గొని అర్చనలు,అభిషేకాలు చేపట్టారు. కళ్యాణం లో 500 మంది దంపతులు శివపార్వతుల కృపలో పాల్గొని కోరిన కోరికలు తీరాలని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఇరువురు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం శివపార్వతులను డప్పు వాయిద్యాలతో గ్రామ మొత్తం కలియుగ తిరుగుతూ పల్లకిలో సేవకు తీసుకువెళ్లారు. అదేవిధంగా జాతర మూడవరోజు కబడ్డీ క్రీడా పోటీలు, ఎడ్ల పందాలు మహిళా కోలాటలు హోరా హోరీగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంతో భక్తుల సౌకర్యార్థం మాజీ దేవాలయ చైర్మన్ ఎలగపల్లి లక్ష్మీ వెంకటేష్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు.దీంతో దేవాలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జాతర సంస్కృతి సంప్రదాయంలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల మణిశర్మ సతీష్ శర్మ ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
అదేవిధంగా జాతర కబడ్డీ క్రీడలలో పాల్గొని పరిచయ వేదికగా నిలిచారు. జాతర క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ రామలింగేశ్వర దేవాలయం కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా పేరొందినన్నారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, దేవదాయ శాఖ అధికారులు మృతుంజయ శాస్త్రి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.