వేద న్యూస్, హన్మకొండ : 

పన్నుల వసూళ్ల తీరును గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నగరంలో మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పన్నులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు.పన్నుల చెల్లింపునకు గడువు సమీపిస్తున్న తరుణం లో నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి కొనసాగుతున్న పన్ను వసూళ్ల విధానాన్ని హంటర్ రోడ్ నక్కల గుట్ట బాల సముద్రం హన్మకొండ బస్ స్టాండ్ రోడ్ ప్రాంతాల్లో పరిశీలించి పలువురు నగర వాసుల నుండి పన్నులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికీ పన్నులు చెల్లించని రెసిడెన్షియల్ కమర్షియల్ బడా బకాయి దారులకు నోటీసు లతో పాటు చాల కాలం పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు అందించడం తో పాటు చెల్లించని వారి ప్రాపర్టీ లు సీజ్ చేశామని అన్నారు. కావున పన్నులు చెల్లింపుకు కేవలం 5 రోజులే గడువు మిగిలిఉన్నందున నగర వాసులు వెంటనే వారు బల్దియా కు బకాయి పడి ఉన్న ఆస్తి నల్లా పన్నులు వెంటనే చెల్లించాలని లేకుంటే ఆస్తులను జప్తు చేస్తామని కమిషనర్ అన్నారు.

పన్ను వసూళ్ల నేపథ్యంలో హన్మకొండ బస్ స్టాండ్ సమీపంలో గల శ్రేయ లాడ్జ్ యాజమాన్యం వారు బల్దియా కు బకాయి పడి ఉన్న ఆస్తి పన్ను రూ.2 లక్షల 40 వేల చెక్ ను కమిషనర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ లు రవీందర్, రాజేశ్వర్, ఆర్ ఓ యూసూఫోద్దిన్ ఆర్ ఐ లు శ్రీకాంత్, దేవరాజు, వార్డు ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.