వేద న్యూస్, నల్లబెల్లి :
నల్లబెల్లి ఎంపీడీవోగా శుభనివాస్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన పసరగొండ రవి ఇక్కడే ఎంపీవోగా కొనసాగనున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్స్ లలో ఎంపికైన శుభనివాస్ కు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఎంపీడీవోగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్బంగా నూతన ఎంపీడీవో శుభనివాస్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించాలని సూచించారు.
ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. మండల స్థాయి అధికారులు అందరం కలిసి సమన్వయంతో పని చేసి జిల్లాలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదామని తెలియజేశారు.