వేద న్యూస్, బోయినిపల్లి :


రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఏపిరాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత బ్యాగులను అందజేస్తుందని ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ మునిరాజ్ అన్నారు.అలాగే బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్,వెంకటరావుపల్లి, లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏపీ రాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగులను పంపిణీ చేశారు. బోయినిపల్లిలో ఏర్పటు చేసిన సమావేశంలో మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్,మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్య బోధన ప్రైవేటు పాఠశాల లకు దీటుగా విద్య బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు ,ఉచిత నోటుబుక్కులు, యూనిఫార్మ్స్ తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తుండగా విద్యార్థులకు ఉన్న బ్యాగుల కొరత ను ఏపీరాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు తీర్చడం అభినందనీయమని అన్నారు. అనంతరం మార్కెటింగ్ మేనేజర్ మునీరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపై శ్రద్ధ పెట్టి మంచిగా చదువుకొని ఊరికి, తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకొచ్చి ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో ఏపిరాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్, సేల్స్ మేనేజర్ స్వప్న, తెలంగాణ ఏపీ డీలర్ ఉమాకాంత్, ప్రధానోపాధ్యాయులు బోలగం శ్రీనివాస్ , జలంధర్ ,రామారావు, నారోత్తం రెడ్డి ,బోయినిపల్లి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు , గసికంటి శ్రీనివాస్, జగన్ మోహన్ రావు, సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.