వేద న్యూస్, సూర్యపేట ప్రతినిధి :

సూర్యాపేట పట్టణంలోని 44 వ వార్డు స్థానిక విజేత హోటల్ చౌరస్తా వద్ద మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 44 వ వార్డు మాజీ కౌన్సిలర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం పురోహితుల వేదమంత్రాల సాక్షిగా స్వామి వారి కళ్యాణం కమనీయం రమణీయంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో స్వామివారి కృపా కటాక్షాలతో ఉండాలని సీతారాములవారిని వేడుకున్నారు. అనంతరం కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు వార్డు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.