వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారాంపురం ఉన్నత పాఠశాల లో సైన్స్ సంబురాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్, రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఆయన అందుకు నోబెల్ బహుమతి సాధించిన సందర్భంగా భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ గౌరవార్థం ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ ఏటా నిర్వహించుకుంటారు.

ప్రధానోపాధ్యాయులు ఎం.రామచంద్రు ఆధ్వర్యంలో సైన్స్ వేడుకలు గొప్పగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నట్లైతే జీవితంలో విజయాలు సాధించి, అత్యున్నతమైన స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు.

సైన్స్ ఉపాధ్యాయులు సునీల్ కుమార్, మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, కేదారి, అనురాధ, షహీన్ సుల్తాన శిక్షణలో విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాలైన పోటీలు, వ్యాసరచన, ప్రసంగము, సైన్స్ పాటలు, సైన్స్ నృత్యం, క్విజ్, రంగోలి, భౌతిక రసాయన, జీవశాస్త్ర ప్రయోగాలు చేసి అందరినీ అలరించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ శ్రీశైలం, సీనియర్ ఉపాధ్యాయులు బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, ఇందిరా, ప్రసాదరావు, శంకర్, ప్రేమ్ సాగర్, హరి, వెంకన్న, సురేష్, సఫియా బేగం, ఉమాదేవి, హరినాథ్ బాబు, భద్ర, వెన్నెల, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.