• నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జిగా తిరిగి బాధ్యతలు చేపట్టాలని సూచించిన సాగర్
  • ఈ విషయమై సమాలోచన చేసి తగు నిర్ణయం తీసుకుంటా: మెరుగు శివకోటి యాదవ్ 

వేద న్యూస్, వరంగల్:
జన సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ప్రముఖ సినీ నటుడు, ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్ ఆర్ కే నాయుడు అలియాస్ సాగర్‌ను.. ఆయన ఆహ్వానం మేరకు హైదరాబాద్ లోని నివాసంలో నర్సంపేట నియోజవర్గ నాయకులు మేరుగు శివ కోటి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదివారం శివకోటి యాదవ్ తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన పలు అంశాలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు, పరిణామాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు సాగర్..శివకోటి యాదవ్ నాయకత్వాన్ని అభినందిస్తూ..నర్సంపేట నియోజకవర్గంలో తిరిగి జనసేన పార్టీ బాధ్యతలు చేపట్టి ముందుకు నడవాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్..అత్యంత బిజీగా ఉన్నందున సమయభావం లేకపోవడంతో..ఎన్నికల అనంతరం కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు.

జనసేన పార్టీకి, ఇన్ చార్జి పదవికి తన రాజీనామాపై అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆమోదం పెండింగ్ లో ఉందని స్పష్టం చేశారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని శివకోటిని సాగర్ కోరారు. ఈ సందర్భంగా శివకోటి యాదవ్ మాట్లాడుతూ తిరిగి జనసేన పార్టీ బాధ్యతలు చేపట్టే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి సమాలోచన చేసేందుకు…తనకు కొద్దిరోజుల గడువు కావాలని తెలిపినట్లు యువ సేన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకోటి వెల్లడించారు.