వేద న్యూస్, వరంగల్ టౌన్:

రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని, అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందని, రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు.బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గోని మాట్లాడారు.

నరేంద్ర మోడీ విశ్వగురు స్థానాన్ని సంపాదించాడని అన్నారు. ఆర్థిక మాధ్యంతో అగ్రరాజ్యం అమెరికా కూడా సతమతం అవుతున్నవేల నరేంద్రమోదీ పరిపాలనలో భారతదేశంలో ఆర్థిక మాంధాన్ని తట్టుకోగల శక్తి కలిగే విధంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడనీ కొనియాడారు.

బాల్క సుమన్ సంస్కారం లేకుండా అడ్డదిడ్డంగా ప్రభుత్వం పై విమర్శలు చేయడం తగదనీ రాజకీయంలో హుందాతనం తగ్గిపోయిందనీ అవేదన వ్యక్తం చేశారు. ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం విమర్శలను ప్రధాన ఎజెండాగా పెట్టుకోకుండా పరిపాలన వైపు అభివృద్ధి వైపు అడుగు వేయాలనీ కోరారు. తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ 10 సీట్లు గెలుస్తుందనీ జాతీయస్థాయిలో 400 పై ఎంపి స్థానాలు గెలుచుకుంటుందనీ జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ దేశ రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

అలాగే మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమం ప్రతీ ఇంటికి చేరుతున్నాయని అన్నారు. మోడీ అందిస్తున్న పాలనకు తెలంగాణ ప్రజలు సైతం ఆకర్షితులవుతున్నారని, దీనికి నిదర్శనం అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, వన్నాల వెంకటరమణ, గడల కుమార్ యాదవ్, పొట్టి శ్రీనివాస్ గుప్తా, మల్లాడి తిరుపతిరెడ్డి, బండి సాంబయ్య యాదవ్, ఇనుముల అరుణ్, బన్న ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.