వేద న్యూస్, వరంగల్:

భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దివంగత బొమ్మల కట్టయ్య 3వ వర్ధంతి కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. బొమ్మల కట్టయ్య 3వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద గల మహనీయుల విగ్రహాల ముందు కట్టయ్య వర్ధంతి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు డీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుద్ధుడు, అంబేద్కర్‌ చూపిన మార్గంలో నడుస్తూ బొమ్మల కట్టయ్య ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు.కట్టయ్యతో తమకు ఉన్నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బొమ్మల కట్టయ్య సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. దళితులపై జరిగే దాడులు, అవమానాలను తీవ్రంగా ఖండిస్తూ వారికి న్యాయం జరిగేలా చాలా పోరాటాలు చేశారని అంబేద్కర్‌ యువజన సంఘం పేరుతో రెండు దశబ్దాలుగా సేవలందిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. రైల్వే శాఖలో విధులు నిర్వర్తిస్తూ కట్టయ్య సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపించేవారని ఎస్సీ, ఎస్టీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కార్యదర్శిగా, అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సేవలందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ హరి రమాదేవి, పల్లం రవి, ఏసీ స్టడీ సర్కిల్ ఎర్రగడ్డ సామీ, డిబిఫ్ రాష్ట్ర నాయకులు రౌత్ రమేష్, కుటుంబ సభ్యులు తరాల రాజమణి, కారం శెట్టి సుజాత, శంకర్ ,గౌతమ్, నిశాంత్, సిద్ధార్థ, రవితేజ, రాహుల్ ,అంబేద్కర్ భవన్ కమిటీ అధ్యక్షులు నీలం మల్లేశం ,వాడ పెద్ద మనిషి కడారి కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు యాదగిరి, బిఎస్ఐ నాయకులు కుమార్, వరుణ్ ,రవి, వివిధ సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు వాకర్స్ అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.