వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
శ్రీరామనవమి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం లోని పలు గ్రామలలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా కల్లేపల్లి గ్రామంలో తరువాత హనుమాన్ పేట రామాలయం మరియు సబ్ జైల్ దగ్గర మహాలక్ష్మి టెంపుల్ ఆలయాలలో రాముల వారి కళ్యాణానికి హాజరై పూజలు నిర్వహించడం జరిగింది. పలు ఆలయాల దగ్గర బహుజన నాయకుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ రాకతో జన సముద్రమైనది,శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి.ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ శ్రీరాముడు సత్య స్వరూపుడు,ధర్మ మూర్తి ,ఆయన రాజ కుమారుడైనా,పౌరుడిగా జీవించాడు.ఆయన యోధుడైనా,దయగల మనిషిగా కరుణకు నిదిగా నిలిచాడు. రాజ్యాన్ని కోల్పోయినా ధర్మాన్ని కోల్పోలేదు.అందుకే శ్రీరాముడు దేవుడు అయ్యాడు.ఆయనకు మనం భక్తులం అయ్యాం.రాముని ప్రతి అడుగులోనూ ధర్మం ఉంది.రాముని ప్రతి మాటలోనూ సత్యమూ,నిజాయితీ ఉంది.రాముని యుద్ధం వెనుక ధర్మం ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు