• ప్రశాంత వాతావరణంలో వినోదప్రియుల ఫేవరెట్ స్పాట్‌గా మల్టీప్లెక్స్..
  • హైదరాబాద్‌ నగర ఎన్విరాన్‌మెంట్‌ను తలదన్నేలా ఫెసిలిటీస్
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇక్కడే
  • మల్టీప్లెక్స్‌లో పరిశుభ్రమైన ఎన్విరాన్‌మెంట్‌ చూసి ప్రేక్షకులు ఫిదా
  • సంక్రాంతి సంబురాలను సినీవినోదంతో సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి

వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి:

పెద్దపల్లి జిల్లా పరిధిలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీలో నిర్మించిన శ్రీరామ సినిమాస్ మల్టీప్లెక్స్ జిల్లాకు, స్థానికంగా ప్రజలు, వినోద ప్రియుల ఫేవరెట్ స్పాట్ గా మారింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా వాసుల చూపు..సుల్తానాబాద్ వైపు ఉండేలా మల్టీప్లెక్స్ పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. సుల్తానాబాద్ నుంచి గట్టెపల్లి రోడ్డుకు వెళ్లే దారిలో రెండు థియేటర్లతో అన్ని హంగులతో నిర్మితమైన మల్టీప్లెక్స్‌ వినోదాన్ని ‘మస్తు’గా అందిస్తోంది. రాబోయే సంక్రాంతి సంబురాలను సినీ ప్రియులు సెలబ్రేట్ చేసుకోవడానికి థియేటర్ కు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవలే తొలి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న శ్రీరామ సినిమాస్ మల్టీప్లెక్స్ .. వినోద ప్రియులకు మరిన్ని ఫెసిలిటీస్ కల్పించనుందని నిర్వాహకులు వెల్లడించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని థియేటర్ ఎన్విరాన్‌మెంట్‌ను సైతం తలదన్నేలా సుల్తానాబాద్ ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్ కొనసాగుతుండటం విశేషం. థియేటర్ క్లీన్ ఆంబియెన్స్, ఆహ్లాదకరంగా పచ్చని పొలాలకు సమీపంలో నగర ఉరుకుల పరుగుల వాతావరణానికి దూరంగా ఉన్న ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్ వినోద ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. తెలుగు వారి పెద్ద పండుగ అయిన ‘సంక్రాంతి’కి స్పెషల్ గా ప్రతి ఒక్కరి సెలబ్రేషన్స్ ఉంటాయి. అందులో భాగంగా సుల్తానాబాద్ సమీప ప్రాంతాల ప్రజలు ‘శ్రీరామ సినిమాస్’ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ కోసం ఆసక్తి చూపేందుకు వెనుకాడటం లేదని చెప్పొచ్చు.

ప్రతి ఏటా సంక్రాంతికి తెలుగునాట కొత్త సినిమాల విడుదల ఉంటుంది. తెలుగు వారు వినోద ప్రియులు కాగా, తమ ఆనందాన్ని థియేటర్ లో బెస్ట్ గా షేర్ చేసుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకున్న అనంతరం.. హాయిగా సినిమాకు వెళ్తుంటారు. అలా ఈ సారి ‘శ్రీరామ సినిమాస్’లో చక్కటి సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ కోసం రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

‘సుల్తానాబాద్ శ్రీరామ సినిమాస్’లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్: రాజు, సుల్తానాబాద్ స్థానికుడు.

సెంట్రల్ ఏసీతో 4కే డాల్బీ అట్మాస్పియర్ కలిగిన ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తోంది. నిర్వాహకుల మెయింటేనెన్స్ కూడా చాలా చక్కగా ఉంది. క్లీన్లీ ఎన్విరాన్‌మెంట్ ఉంది. చక్కగా పొలాలకు దగ్గరలో విశాలమైన ప్రశాంత వాతావరణంలో థియేటర్ నిర్మించిన నిర్వాహకులకు ధన్యవాదాలు.

 

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సినిమాలు చూడొచ్చు: మీనాక్షి, పెద్దపల్లి స్థానికురాలు

హైదరాబాద్ లోని థియేటర్లను తలదన్నేలా సుల్తానాబాద్ ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్ ఉంది. ఈ థియేటర్ లో మూవీస్ చూడటానికి వచ్చి ఇక్కడి వాతావరణం చూసి ఆనందపడిపోయాను. బెస్ట్ ఎన్విరాన్ మెంట్ లో సినిమాలు చూడాలనుకునే ప్రతిఒక్కరూ ఇక్కడికి రాావాలని కోరుతున్నా. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంక్రాంతికి వినోద ప్రియులు శ్రీరామ సినిమాస్ కు వచ్చి సినిమాలను వీక్షించొచ్చు.