వేద న్యూస్, డెస్క్ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మ నగర్ గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ కనిపించిన వ్యక్తులపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆ గ్రామానికి చెందిన పిట్టల స్వరూప సంపత్ దంపతుల కుమారుడు శివ 3 సంవత్సరాల బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స కోసం వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలిoచినట్లు సమచారం.గ్రామంలో సంచరిస్తున్న పిచ్చి కుక్కల బారి నుండి తమ పిల్లలను కాపాడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.