- జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి
వేద న్యూస్, జమ్మికుంట:
ఎన్నికల మోడల్ కోడ్ కండక్టు అమలులో ఉన్న నేపథ్యంలో జమ్మికుంట మున్సిపల్, మండల పరధిలోని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గ్రామంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం రవాణా, డీజే సౌండ్ సిస్టం పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించినా, నిబంధనలకు మించి డబ్బులు తరలింపులు చేసిన కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టకూడదని సూచించారు. అలాంటి ఘటనలకు పాల్పడితే గ్రూప్ అడ్మిన్, పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తిస్తున్నామని, ఎన్నికలను సజావుగా నిర్వహించడమే పోలీసుల కర్తవ్యమని చెప్పారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారి పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో రౌడీ షీటర్, హిస్టరీ షీట్, బైండోవర్ కేసులు ఉన్న వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. లేనిపక్షంలో తహశీల్దారు ఎదుట ప్రొడ్యూస్ చేస్తామని, తద్వారా లక్ష రూపాయల జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్, మండల పరిధి గ్రామాల్లోని ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.