– విద్యార్థుల ముందస్తు బతుకమ్మ, దసరా ఉత్సవాలు
వేద న్యూస్, సుల్తానాబాద్:
దసరా, బతుకమ్మ పండగను పురస్కరించుకొని సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. పిల్లలు, తల్లితండ్రులు ఈ సంబురాల్లో అధిక సంఖ్యలో పాల్గొని., ఆట పాటలతో అలరించారు. అనంతరం రావణదహన చేశారు.

ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సంబురాలను తిలకించి ఉత్సవాలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమర్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ‌కు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. పిల్లల రామలక్ష్మణ, సీత వేషధారణ పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.