– నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ రమేశ్
వేద న్యూస్, ఓరుగల్లు:
యువతకు మార్గదర్శి సుభాష్ చంద్రబోస్ అని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ రమేశ్ అన్నారు. ములుగు రోడ్డులోని వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి 10వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ హాజరయ్యారు.

‘జాతీయ ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్’ అనే అంశంపై ప్రసంగించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. రమేశ్ మాట్లాడుతూ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి వేలమంది యువతను సైన్యంలో పనిచేయాలని కోరారని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పిలుపు మేరకు జపాన్, జర్మనీ సహాయ సహకారలందించే దిశగా కృషి చేశాయని వివరించారు.

జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ తర్వాత అంతే స్థాయిలో సుభాష్ చంద్రబోస్ యువతకు మార్గదర్శకులని వెల్లడించారు. ప్రసంగం అనంతరం ప్రొఫెసర్ రమేశ్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, శశాంక్, అక్షయ్, బాల జోహార్, అమ్మన్న, రాజు, పవన్, రాము, విష్ణు, ఓం శ్రీ, రాధిక రాధిక, నేహస్తి, దేవేందేర్, క్యాడెట్లు పాల్గొన్నారు.