వేద న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట కొత్తూరు కాలనీలో.. సుక్కోత్ సేవా సంఘం ఆధ్వర్యంలో చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ సమ్మర్ క్యాంప్ రెండు రోజులు నిర్వహించారు.
పిల్లలకు ఆటలు పాటలతో పాటు చదువు పట్ల ఆసక్తిని కలగజేసే విషయాలను తెలియచేయడం తల్లిదండ్రులు మాట విని మంచి నడవడిక నడుచున్నట్లుగా వారికి బోధించారు. పిల్లలకి పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుక్కోత్ సేవా సంఘం అధ్యక్షుడు వగలబోయిన వేణు కుమార్, గీతాంజలి, సోయం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.