వేద న్యూస్, వరంగల్ : 

 

అనుమానాస్పద వాహనాల పై నిఘా  ఉంచాలని అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారి, జీడబ్ల్యుఎంసీ కమిషనర్  అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఆదివారం  వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంజీఎం కూడలి అన్ లిమిటెడ్ వద్ద గల ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా  తనిఖీ చేసి సమర్డవంత నిర్వహణకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భం గా ఏ ఆర్ ఓ మాట్లాడుతూ ఎస్ ఎస్ టి బృందాలు సమర్థం వంతంగా నిబద్ధతతో విధులు నిర్వహించాలని అన్నారు.ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను పక్కగా పాటించాలని,ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, డబ్బు, మద్యం ఇతర వస్తువుల తరలింపు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అనంతరం  నిర్వహిస్తున్న రిజిస్టర్ ను కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమం లో  ఎస్ ఎస్ టి టీమ్ ముఖ్య అధికారి శ్రీనివాస రెడ్డి మట్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.