వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :

మైనర్ బాలికపై ఇటుక బట్టి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పాత సూర్యాపేట వెంగమాంబ బాలాజీ హలో బ్రిక్స్ లో బ్రతుకుతెరువుకు పనిచేయడానికి బీహార్ నుండి వచ్చిన ఒక కుటుంబం గురువారం వారి భార్యను తీసుకొని పిల్లల్ని ఇటుకబట్టి వద్దనే ఉంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లారు. ఆ ఇటుక బట్టి వద్దనే ఉన్న ఇటుక బట్టి యజమాని వెంకటరమణ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే తన రూమ్ వద్ద మద్యం సేవించి మద్యం మైకంలో తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలికపై బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తానని పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ బాలిక లబోదిబోమని మొత్తుకుంటూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ వెంకటరమణని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.