•  ‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా..
  •  ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  •  ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి

వేద న్యూస్, హన్మకొండ:

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం స్వచ్ఛత, పచ్చదనం, ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు.

ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణతో పాటు గ్రామంలో పరిశుభ్రతను పాటించాలని, విరివిగా మొక్కలను పెంచాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఖురేషి పిలుపునిచ్చారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

ర్యాలీలో పంచాయతీ సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఇంజపెల్లి నరేష్, ప్రధానోపాధ్యాయుడు సతీష్ కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.