వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :

ఎల్‌బీ నగర్‌లోని కాస్మో ఫంక్షన్ హాల్‌లో తహఫుజ్-ఎ-నామూస్-ఎ-రిసాలత్ కాన్ఫరెన్స్ . సున్నత్–సీరత్ ఇనామాల పంపిణీ కార్యక్రమం–2025” విశేషంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజ్రత్ సయ్యద్ షాహ్ గులాం అఫ్జల్ బియాబానీ రిఫాయీ కాద్రీ అలియాస్ ఖుస్రో పాషా, పిటథీపాతీ దర్గా ఖాజీపేట్. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్) హాజరై మాట్లాడుతూ – ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) సీరత్‌ను, సున్నతులను మన జీవితంలో ఆచరించడం ద్వారా సమాజంలో ప్రేమ, ఐక్యత, సేవాస్ఫూర్తి పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మౌలానా ఖ్వాజా జాఫర్ అలాబ్దీన్ ఖాదిరీ రిజ్వీ (డైరెక్టర్, జామియా ముహమ్మదియా ఖైరుల్ ఉలోమ్, వరంగల్) సీరత్ ప్రాముఖ్యతను వివరించారు. ఉలమా, మదరసాల ప్రతినిధులు పాల్గొని యువతలో ఇస్లామిక్ విలువలు, మానవత్వం, నీతి బోధనల పట్ల చైతన్యం పెంచాలని పిలుపునిచ్చారు.

మౌలానా ముఫ్తీ మొహమ్మద్ షరఫ్‌ఊద్దీన్ మిస్బాహీ, హాఫిజ్ అఫ్జల్ అలీ షా (ముత్తమిం, జామియా బర్కాతియా, హన్మకుండ), ఎం.ఏ. జబ్బార్ (చైర్మన్, తవక్కుల్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు ఈద్‌గాహ్ కిల్లా వరంగల్ అధ్యక్షుడు) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మహిళల కోసం ప్రత్యేక పర్థా ఏర్పాట్లు చేయగా, ఈ కార్యక్రమాన్ని పాస్బాన్-ఎ-సున్నత్ వరంగల్ సంస్థ సమర్థవంతంగా నిర్వహించింది.

నిర్వాహకుల్లో హాఫిజ్ హమీద్, హాఫిజ్ అఖీల్, హాఫిజ్ అబ్దుల్ కరీమ్, హాఫిజ్ ముస్తఫా, హాఫిజ్ తాహిర్, షాహిద్ రజా, హాఫిజ్ నౌమాన్, సయ్యద్ ముజ్తబా తదితరులు చురుకుగా వ్యవహరించారు. వివిధ మదరసాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ప్రథమ బహుమతి విజేతకు ఉచిత ఉమ్రా ప్యాకేజ్‌తో పాటు ప్రత్యేక సత్కారం అందజేశారు.
కార్యక్రమం చివరగా దువా మరియు సలాంతో ముగిసింది.