•  డీఐఈవోకు బీసీ యువజన సంఘ జిల్లా అధ్యక్షులు ప్రణయ్ వినతి
    వేద న్యూస్, ఆసిఫాబాద్:

    కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షఉలు ఆవిడపు ప్రణయ్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం డీఐఈవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

జిల్లాకేంద్రంలో నడపబడుతున్న సదరు కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ, జూనియర్ కాలేజీని ఒకే బిల్డింగ్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే బిల్డింగ్ లో డిగ్రీ, జూనియర్ కాలేజీ లు నడపకూడదని నిబంధన ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ కాలేజీతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రణయ్ వెంట బీసీ యువజన సంఘం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నాయకులు గడ్డల ప్రణయ్ కుమార్ ఉన్నారు.