- విద్యార్థులకు AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ పై అవగాహన సదస్సు
వేద న్యూస్, వరంగల్:
వరంగల్ ప్రాంతంలోనీ కరీమాబాద్ బ్రిలియంట్ హై స్కూల్ లో AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ మీద ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు అవినాష్ బండి, మోహన్ బండి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అణుగుణంగా పాఠశాల స్థాయి విద్య నుండే విద్యార్థులలో AI మరియు రోబోటిక్ టెక్నాలజీ, వర్కింగ్ మోడల్, తయారీ విధానం, ఉపయోగాలు, నిరుపయోగాలు వంటి అంశాలతో పిల్లలకి రెండు రోజుల సదస్సును నిర్వహించినట్టు తెలిపారు.
కార్యక్రమంలో అంతరిక్ష ప్లాంటోరియంతో పాటు ఈ సదస్సును ప్రతీ నెల ఈ విద్యా సంవత్సరంలో డిజిటల్ కరీక్యూలం ,రోబోటిక్ కరీక్యూలం నిర్వహించి విద్యార్థులు స్వయంగా రోబోట్ల ను తయారు చేసే విధంగా శిక్షణ అందించబోతున్నాం అని డైరెక్టర్ అని తెలిపారు.

తమ విద్యార్థులను టెక్నాలజీ విషయంలో అడ్వాన్స్ గా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అవినాష్ బండి, మోహన్ బండి ఇంచార్జి రజిని, మమత ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
