• నియామక పత్రం అందజేసిన నాయకులు
  • రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: తిరుపతి

వేద న్యూస్, ఎల్కతుర్తి:
తెలంగాణ రైతు రక్షణ సమితి ఎల్కతుర్తి మండల అధ్యక్షులుగా తిరుపతిని ఆ సమితి నాయకులు నియమించారు. రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీధర్ రావు ఆదేశాల మేరకు ఆదివారం ఆ సమితి ఎల్కతుర్తి మండల అధ్యక్షునిగా మండల పరిధిలోని దామెర గ్రామానికి చెందిన కోకు తిరుపతి ముదిరాజ్ ను నియమించారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు భాస్కర్ అందజేశారు.

కార్యక్రమంలో ఆ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావు, జిల్లా రైతు నాయకులు సురావు బాపూరావు, అంబీరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రక్షణ సమితి ఎల్కతుర్తి మండల అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ తన నియమకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావుకు, జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాత సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. రైతు సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.