వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ లో నందనం భారతమ్మ అనే వృద్దురాలు రూ.3 లక్షలు విత్ డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి తన వాహనంపై ఇంటివద్ద దింపుతా అంటూ మాయమాటలు చెప్పి స్కూటీ ఎక్కించుకొని ఫిరంగడ్డ వైపు ఆపి దింపి డబ్బులు సంచి తీసుకొని పారిపోయాడు. దీంతో ఆ వృద్దురాలు పోలీసులను ఆశ్రయించగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేశారు.సీసీ కెమెరాల ఆధారంగా దొంగ చిత్రాన్ని విడుదల చేసి పట్టించిన వారికి రూ.10 వేలు నజరనా ప్రకటించి వారి పేర్లను గోప్యంగా ఉంచబడును అని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు.