- కాంగ్రెస్ అభ్యర్ధిని కొండా సురేఖ
వేద న్యూస్, వరంగల్ టౌన్:
తూర్పు నియోజక వర్గంలోని 26వ డివిజన్ లో పెద్ద ఎత్తున వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తేనే తెలంగాణ సాధించుకున్నామని ఆమె అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం దొంగల చేతిలోకి పోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఆమె ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ప్రజల సంక్షేమంగా ఉండాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందేనని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,డివిజన్ అధ్యక్షులు, మహిళలు, యువకులు కొండ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.