•  ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ

వేద న్యూస్, హన్మకొండ :

ఎస్సీల వర్గీకరణ జరిగినప్పుడే అన్ని రంగాల్లో మాదిగల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మార్పీ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీ ఎస్ నూతన నిర్మాణంలో భాగంగా సోమవారం కాజీపేట మండల కమిటీ ఎన్నిక చెయ్యటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గద్దల సుకుమార్ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేస్తున్నరన్నారు. ఈ పోరాటం ఎస్సీల వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో సాధించుకునే సమయం వచ్చిందని ఇలాంటి సమయంలో మాదిగ యువకులు ఎమ్మార్పీఎస్ నిర్మాణం లో భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి మోడీ సైతం వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. త్వరలో వర్గీకరణ సాధించుకోవడం కోసం మరింత శక్తి ని కూడాగట్టే భాగంలోనే నూతన నిర్మాణం చేపడ్తున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం కమిటీ ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా రాజరాపు క్రాంతి మాదిగ , ప్రధాన కార్యదర్శి గా ఇనుగలా రాజు మాదిగ ,ఉపాధ్యక్షులుగా వస్కుల ప్రణయ్ మాదిగ , మంద ప్రశాంత్ మాదిగ , కార్యదర్శుల్గా గడ్డం శివ మాదిగను , అరికిల ప్రభు కుమార్ మాదిగలను ఎన్నిక చేశారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రేణుకుంట్ల. ఉమామహేష్ మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మంద. స్వరాజ్ మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు.