వేద న్యూస్, జమ్మికుంట:
‘ఆటో బతుకులు’ సీరియల్ మొదటి ఎపిసోడ్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రెస్ భవన్ లో బుధవారం టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి హుస్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చిత్ర హీరో ఆటో రవికుమార్ హాజరయ్యారు. టో కార్మికుల జీవితాలను అద్దంలో చూపెట్టే సీరియల్ 100 ఎపిసోడ్లు ఉంటుందని, ప్రతీ శనివారం మూడు సంవత్సరాలు సీరియల్ సైరన్ యూట్యూబ్ లో కొనసాగుతుందని, ఆటో కార్మికులు అందరూ కూడ ఆదరించాలని అంబాల ప్రభాకర్ కోరారు.

ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల జీవన విధానంపై తీసిన సీరియల్ అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సీరియల్ నటించిన హీరో రవికుమార్,స్క్రీన్ ప్లే దర్శకత్వం నగునూరు విజయ్ కుమార్ లను అభినందించారు. ఆటో డ్రైవర్లు ప్రతిరోజు నీతి నిజాయితీతో ప్రజలకు అందుబాటులో ఉంటూ..రాత్రనక పగలనక ఆటోలను నడిపితే దినసరి కూలీ కూడ గిట్టుబాటు కావడంలేదని వివరించారు.

ఆటోలపై తీసుకున్న నెలసరి ఫైనాన్స్ లు కానీ, రోజు వారి చిట్టీలు గాని కట్టలేని పరిస్థితిలో దయనీయంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎందరో ఆటో డ్రైవర్ లు ఆత్మహత్య చేసుకున్న విషయం మన అందరికి తెలుసని చెప్పారు. నూతనంగా ఏర్పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం, కానీ, ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడి భార్య పిల్లలను సాదుకోలేని పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఆవేదనతో తెలిపారు.

ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గము నూతన ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి,ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షులు రాజేందర్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో చిత్ర డైరెక్టర్ నగునూరి విజయకుమార్, టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ర్ట నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ చిత్ర, నటి నటులు దార మధు, కాంపల్లి శ్రీనివాస్, మాతంగి శివకుమార్,అనుముల కళావతి, మాతంగి లక్ష్మణ్, కాశిపేట రాజయ్య, కన్నం లక్ష్మణ్, టి జి పి ఏ రాష్ర్ట సెక్యూర్టి పోర్స్ కన్వీనర్ డి ఎస్ నందం, సెక్యూర్టి పోర్స్ సభ్యులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.