వేద న్యూస్, ఎల్కతుర్తి:
కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోమవారం ఎల్క తుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగించుకొని సైదాపూర్ మండలం వెళ్తున్న క్రమంలో హుజురాబాద్ శివారు లో ఎన్నికల కోడ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా..పొన్నం కారును ఆపారు.
ఆ కారులో ఉన్న సూట్ కేసును, పోలీసు సిబ్బంది అదేమిటి అని ప్రశ్నించగా.. ‘‘ఇది నా ఆస్తి, చూపించమంటారా?’’ అని ఆ సూట్ కేసు ను పొన్నం ప్రభాకర్ తెరిచి చూపించారు. ఆ సూట్ కేసులో పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, పార్ల మెంటు లో పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రే దాడికి గురైనప్పటి దృశ్యాలు, ప్రధాని మన్మోహన్ సింగ్ తో, పలువురు పార్లమెంటు సభ్యులతో, తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధి తో సమావేశం అయిన చిత్రాల గురించి చెప్పారు.
అక్కడున్న అధికారులతో ప్రభాకర్ మాట్లాడుతూ ‘‘నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర నే … నా ఆస్తి అని, తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడానని, మీరు తెలంగాణ బిడ్డలు అయితే, మీరు తీసిన వీడియోను మీడియా కు పంపండి అని, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించిన ఉద్యమ కారుల ఘనత ను చాటండి’’ అని కోరారు.