వేద న్యూస్,వరంగల్ టౌన్:

అగ్రరాజ్యమైన అమెరికాలో డాక్టర్‌ బీ ఆర్ అంబేడ్కర్‌ 19 ఫీట్ల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల మాల మహానాడు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు మన్నే బాబు రావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ నగరంలోని బల్లియ కార్యాలయం నుండి కాజీపేట వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

అంతకుముందు బల్దియాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్నే బాబురావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అగ్రరాజ్యం వాషింగ్టన్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కానీ మన భారతదేశంలో ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.