వేద న్యూస్, సుల్తానాబాద్ :

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని మున్సిఫ్ కోర్టు జడ్జి జీఎస్ఎల్ ప్రియాంక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వివరాలు, వైద్యుల డ్యూటీ పట్టికను తనిఖీ చేసి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జడ్జి ప్రియాంక మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం ఏర్పడేలా వైద్యులు రోగులకు వైద్యం అందించాలని, ప్రజలు ప్రభుత్వం హాస్పిటల్ పై అపనమ్మకం విడనాడి ప్రభుత్వం ఆసుపత్రులను సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.