- లయన్స్ క్లబ్ ద్వారా సుల్తానాబాద్ వాసులకు సేవలు
- ప్రవీణ్ కుమార్ మున్సి‘పోల్’ బరిలో నిలవాలని పీపుల్ రిక్వెస్ట్
వేద న్యూస్, సుల్తానాబాద్:
నలుగురికి సేవ చేయాలనే ఆశయం.. దాని కోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా, కష్టమైనా పడే ఓర్పు.. ఆనందం ఎదుటి వారి చిరునవ్వుల్లో ఉంటుందని నమ్మే వ్యక్తి ఆయన. చేతికి ఎముక లేని దాతగా జనంలో పేరు సంపాదించుకుని.. తెర వెనుక ఉండి ప్రజా సం‘క్షేమం’ కోసం పాటు పడుతున్న మృదుస్వభావి.. ఇంతకీ ఆయనెవరంటే.. లయన్స్ క్లబ్ ద్వారా విస్తృతంగా సేవలందిస్తున్న సేవా సారథి సుల్తానాబాద్ మున్సిపల్‌వాసి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్.
ఏ పదవి లేకున్నా ప్రజల కోసం పరితపిస్తూ.. నిబద్ధతతో సేవలందిస్తున్న ప్రవీణ్.. ప్రజాక్షేత్రంలోకి దిగితే పోటీలో నిలబెడితే వార్ వన్ సైడ్ అయి.. విక్టరీ కన్ఫర్మ్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని అంటున్నారు.
సేవామార్గంలో పయనం
మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ పేరు చెబితే చాలు.. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో తెలియని వారు ఉండబోరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సేవామార్గంలో ముందుకెళుతూ.. పంచే గుణం కలిగి ఉన్న నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు.
విషయం, సందర్భం ఏదైనా ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా తెరవెనుక ఉండి తన అనుచరగణం, కార్యకర్తల ద్వారా జరగాల్సిన కార్యక్రమాలు, పనులను నిరాటంకంగా జరిపించేలా వ్యూహరచన చేయగల ధీశాలి ప్రవీణ్. కార్యకర్తలు, అనుచరులకు అండగా నిలుస్తూ.. అనుకున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయగల నేర్పరితనం, క్రియాశీలత కలిగిన లీడర్ మిట్టపల్లి ప్రవీణ్.
అందరివాడు ప్రవీణ్
మృదుస్వభావి అయిన ప్రవీణ్ రాజకీయాలకు అతీతంగా సేవాసారథిగా, అజాతశత్రువుగా అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని జనం కోరుతున్నారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగితే.. గెలుపు నల్లేరు మీద నడకే అని అభిప్రాయపడుతున్నారు. అందరినీ కలుపుకుని పోయే స్వభావం కలిగి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సాయం చేసే గుణం ఉన్న ప్రవీణ్ ప్రావీణ్యం జనం మనసులో ఉందని, ఆయన జనంలోకి వస్తే విక్టరీ ఖాయమని అంటున్నారు.
పని చేసుకుని పోయే తత్వం కలిగి, నలుగురిని ముందుంచి వెనుకుండి వారికి అండగా నిలిచే సామర్థ్యం కలిగిన ప్రవీణ్ ప్రజాక్షేత్రంలోకి రావాలని మున్సిపల్ వాసులు కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో ఆయన ఏ వార్డు నుంచి బరిలో దిగినా.. అక్కడ ప్రత్యర్థికి ముచ్చెమటలు ఖాయమని అభిప్రాయం వినబడుతోంది. ఆయన కంటెస్ట్ చేస్తే చాలు.. మున్సిపల్ చైర్మన్ అయినట్టేనని కూడా పేర్కొంటున్నారు.
సేవాదనుడు ప్రవీణ్
అభివృద్ధిలో సుల్తానాబాద్ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లగలడం సేవాదనుడు అయిన ప్రవీణ్‌కు సాధ్యమని కొందరు వెల్లడిస్తున్నారు. ప్రజల్లో మమేకమయి ఉండే ప్రవీణ్ తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలోకి దిగి పోటీ చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ఆయన పోటీ కోసం కొందరు అయితే వేచి చూస్తున్నారు. రాజకీయంగా ఆయన బీజేపీలో ఉండగా, సుపరిపాలన ఆయన ధ్యేయంగా ఉంటుందని, సుల్తానాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో పయనం ఆయనతోనే సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

