• అన్ని వర్గాల ఆదరాభిమానాలు చూరగొన్న నేత
  • ఉద్యమనేతగా, గులాబీ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు
  • నిత్యం జనంలో ఉంటూ..వారికి అండగా నిలుస్తున్న ఆర్ వీ

వేద న్యూస్, గోషామహల్:
గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం జనంతో మమేకమై..వారి సమస్యల పరిష్కారినికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ.. చిత్తశుద్ధితో పని చేసే నాయకులను జనం తప్పకుండా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కోవకు చెందిన రాజకీయ నాయకుడే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమ నేత ఆర్ వీ మహేందర్ కుమార్. ప్రజా ప్రయోజనాలు పక్కనబెట్టి..తమ అవసరాలు, రాజకీయ అధికారం కోసమే పార్టీలు..కండువాలు మార్చినంత ఈజీగా మార్చే రాజకీయ నాయకులున్న ఈ కాలంలో..ఒకే పార్టీని నమ్ముకుని 24 ఏండ్లకు పైగా ఒకే పార్టీలో కొనసాగుతున్న అరుదైన రాజకీయ నాయకుడు ఆర్ వీ మహేందర్ కుమార్.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ ‘నాడు’ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఆర్ వీ మహేందర్ కుమార్ శక్తివంచన లేకుండా శ్రమించారు. గోషామహల్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ పరిధిలో పార్టీ కోసం ఉద్యమం కోసం పని చేశారు.

పదవి ఉన్నా..లేకపోయినా..సమస్యల పరిష్కారినికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికీ పదవితో సంబంధం లేకుండా..తను ఉన్న పార్టీ అధికారంలో లేకున్నా తనను నమ్ముకున్న జాతి, ప్రజల కోసం పోరాటమే మార్గంగా పని చేస్తున్నారు. మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధన కోసం ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గా ఉన్న ఆర్ వీ మహేందర్ కుమార్ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. నిత్యం జనంతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్న నాయకుడిగా ఆర్ వీకి చక్కటి పేరుంది.

ఉమ్మడి ఏపీలో సమైక్య పాలకుల పాలనలో గులాబీ జెండా పట్టుకుని..ఉద్యమానికి ఊపరిలూదిన ఆర్ వీ మహేందర్ కుమార్..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన ప్రశ్నించే గొంతుకగా భారత జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. ప్రతిపక్షంగా బలమైన పాత్రను బీఆర్ఎస్ పార్టీ పోషిస్తోందని ఆర్ వీ మహేందర్ పేర్కొంటున్నారు.

బీసీల హక్కుల సాధనకు భారత జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తోన్న ఉద్యమంలో ఆర్ వీ మహేందర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు జరిగిన కార్యక్రమాల్లో ముందు వరుసలో ఆర్ వీ ఉన్నారు. ఈ విషయమై నాయకులతో కలిసి తెలంగాణ శాసన సభకు స్పీకర్ కు వినతి పత్రం సమర్పించారు.

గులాబీ జెండా నీడన అధికారంలో ఉన్నపుడు తనకు అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోయినప్పటికీ..ఆర్ వీ మహేందర్ కుమార్ పింక్ పార్టీలోనే ఉంటూ..ఆ పార్టీ అధినేత మార్గదర్శనంలో పని చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు ఉండాలనే విషయాన్ని మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపిస్తున్న వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఆర్ వీ ఎం పేరు చెప్పొచ్చు.