•  బీఆర్ఎస్ కార్పొరేటర్లు

వేద న్యూస్, వరంగల్:

గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ వినతి పత్రంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయిన గుండు సుధారాణి ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీలో జాయిన్ అయ్యారని తెలిపారు.

మేయర్ కు గురువారం నిర్వహించే బడ్జెట్ సమావేశంలో పాల్గొనే హక్కు లేదని పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. కావున ఆమె సమావేశం నిర్వహించలేదని,ఆ సమావేశాన్ని కలెక్టరేట్, లేదా కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని వరంగల్ కు చెందిన 19 మంది కార్పొరేటర్ల సంతకాలతో వినతిపత్రం అందజేశారు.